చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోటలో కరోనా పాజిటివ్ కేసు ఒకటి నమోదైంది. స్థానిక వస్త్ర దుకాణం యజమాని పది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న వ్యాపారికి తీవ్ర జ్వరం రావటంతో బెంగళూరు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. అక్కడ అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బీ.కొత్తకోట మండలంలో పర్యటించి కరోనా పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పల్లె పల్లె తిరిగి తెలియజేస్తూ చైతన్య పరచారు.
బీ.కొత్తకోటలో కరోనా పాజిటివ్ కేసు - latest chittor district news
చిత్తూరు జిల్లా బీ.కొత్తకోటలో తాజాగా ఒక కరోనా కేసు నమోదైంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గ్రామంలో పర్యటించి కరోనా పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
బీ.కొత్తకోటలో కరోనా నియంత్రణ చర్యలపై ఎమ్మెల్యే అవగాహన
ఇది చదవండి ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్ అరెస్ట్