చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో కొండయ్యగారి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండయ్యగారి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్తూరు పట్టణానికి చెందిన ప్రతాప్.. భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత, చెంగప్ప అనే మరో వ్యక్తితో కలిసి కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తమ బంధువుల వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో కారులో వాగు దాటేందుకు యత్నించగా.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగడంతో డ్రైవర్ కిరణ్ అద్దాలు పగులగొట్టి ఒక్కొక్కరినిని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సాయి వినీత నీటిలో కొట్టుకు పోతుండడంతో కాపాడేందుకు తండ్రి ప్రతాప్ ప్రయత్నించాడు. నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.
సాయి వినీత మృతదేహం లభ్యం..