ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నామినేషన్లు తీసుకుంటారా లేదా?' - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం ఎదుట కోళ్ల బైలు పంచాయతీకి సంబంధించిన నామినేషన్లు తీసుకోవడం లేదని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన
మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన

By

Published : Feb 4, 2021, 12:36 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి లైన్​లో ఉన్నా.. కోళ్ల బైలు పంచాయతీకి సంబంధించిన నామినేషన్​లు తీసుకోవడం లేదని అధికారుల తీరుపై నిరసన చేపట్టారు. అధికారుల తీరు చూస్తుంటే నామినేషన్లు దాఖలు చేయాకూడదనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారని వారు మండిపడ్డారు.

గురువారం ఒక్కరోజే గడువు ఉండటంతో నామినేషన్లు కచ్చితంగా తీసుకుంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. అన్ని పార్టీల వారు నామినేషన్లు వేశారు. ఎలాంటి అలజడులు, ఘర్షణలు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్ వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details