ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. తెదేపా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జోరు ప్రచారం - నోటిఫికేషన్​కు ముందే తెదేపా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జోరు ప్రచారం వార్తలు

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తెదేపా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో తెదేపా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ.. సైకిల్ గుర్తుకు ఓటు వేసి.. వైకాపా అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Campaigning of TDP ZPTC and MPTC candidates
తెదేపా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జోరు ప్రచారం

By

Published : Mar 9, 2021, 2:39 PM IST


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో తెదేపా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని తెదేపా తరుపున బరిలో నిలిచిన సుబ్రహ్మణ్యం నాయుడు అధ్వర్యంలో జడ్పీటీసీ అభ్యర్థి కుమార్ రాజారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ రోజు మండలంలోని బుచ్చినాయుడు పల్లి, శంకరయ్యగారిపల్లి, శ్రీనివాస మంగాపురం, నరసింగాపురం పంచాయతీలలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి.. వైకాపా అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లదేనని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details