చిత్తూరు జిల్లా పలమనేరు గాంధీనగర్ గ్రామంలో ఏనుగల దాడి కలకలం సృష్టించింది.గ్రామంలో లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి కి చెందిన ఆవులను,దూడల పై ఏనుగులు దాడి చేయగా,దూడ మృతి చెందింది.ఈ ఘటన పై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.గ్రామంలోకి వచ్చిన అధికార్లతో.గ్రామస్థులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.నిత్యం ఏనుగుల దాడులతో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయ భూములు,మూగజీవాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు.రైతుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
ఏనుగుల సంచారంపై అధికార్లతో గ్రామస్తుల వాగ్వాదం - elephant
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో మూగజీవాలపై ఏనుగుల దాడి చేయడంతో, ఓ దూడ మృతి చెందింది. ఈ ఘటనపై విచారించేందుకు వచ్చిన అటవి శాఖ అధికార్లతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఏనుగు దాడిలో మృతిచెందిన దూడ