Heart attack to Bus Driver: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలో మదనపల్లె డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు వెళ్తోంది. ఒక్కసారిగా డ్రైవర్ రవి గుండెపోటుతో సీటులోనే మృతి చెందాడు. దీంతో బస్సు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లబోయింది. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్‌ను కంట్రోల్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మదనపల్లె నుంచి పుంగనూరు మీదుగా 69 మందితో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు చాకచక్యంగా వ్యవహరించడంతో 69 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.