గంగవరం మండలం నాగిరెడ్డి పల్లెలోని జిలానిబాబా దర్గాలో పాత చాదర్లు కాలిపోయాయి. దొంగతనం కోసం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులే పాత చాదర్లకు నిప్పంటించి ఉంటారని దర్గా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ప్రాంతంలో అన్ని మతాల వారు సామరస్యంతో ఉంటారని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.