చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో సంక్రాంతి సందర్భంగా పశువులపండగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు దాదాపు 10 వేల మందికి పైగా వచ్చారు. సుమారు వెయ్యి పశువులను గుంపులు గుంపులుగా యువకుల మధ్య వదిలారు. కోడెగిత్తలను అదుపు చేసి.. వాటి కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో యువకులకు స్వల్పగాయాలయ్యాయి. గ్రామస్థులు వచ్చిన వారిని భోజన సదుపాయాలు, గాయపడిన వారి కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.
రామిరెడ్డిపల్లిలో పశువుల పండగ - రామిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న పశువుల పండగ
సంక్రాంతి సందర్భంగా చంద్రగిరి మండలంలో ఏటా నిర్వహించే పశువులపండగను చూసేందుకు ఎప్పటిలాగే జనం భారీగా తరలి వచ్చారు. ఈలలు, కేరింతల మధ్య ఈ పండుగ ఉత్సాహంగా సాగింది.
రామిరెడ్డిపల్లిలో కొనసాగిన పశువులపండగ