ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న యువత.. - pasuvula pandaga

చిత్తూరు జిల్లా చిన్నరామాపురంలో సందడిగా పశువుల పండగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఎద్దులతో పోటీ పడ్డారు. దీనిని తిలకించేందుకు చుట్టుపక్కల నుంచి అనేకమంది తరలివచ్చారు.

animal festival in chittoor district
పశువుల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న యువత

By

Published : Mar 14, 2021, 3:39 PM IST

సంక్రాంత్రి పండుగ పూర్తై రెండు నెలలు కావస్తున్నా.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మాత్రం ఆ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో కోడెగిత్తలతో సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు. చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో జరిగిన పశువుల పండగ వేడుకల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామస్థులు ఉదయం పశువులను పూజించి వాటి కొమ్ములకు రంగులు అద్దారు. రాజకీయ, సినీ ప్రముఖుల చిత్రపటాలను వాటి కొమ్ములకు కట్టి రంగంలోకి దించారు. డప్పుల శబ్దాలకు ఎద్దులు పరుగెత్తుతుంటే వాటిని నిలువరించేందుకు.. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన యువకులు పోటీ పడ్డారు.

పశువుల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న యువత..

ఈ కార్యక్రమంలో కొందరు ఎద్దుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకుని కేరింతలు కొట్టారు. పోటీలను చూసేందుకు.. చుట్టు పక్కల గ్రామస్థులు, యువకులు భారీగా తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. మేడలు, చెట్లపై నుంచి పోటీలను ఆశక్తి తిలకించారు. అక్కడకి వచ్చిన ప్రజలకు గ్రామస్థులు భోజన వసతులు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:చిత్తూరు, తిరుపతి సెంటర్లలోనూ.. ఫ్యాన్ హవా

ABOUT THE AUTHOR

...view details