చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం రావిళ్ళవారి కండ్రిగలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన రెడ్డి ఈశ్వరయ్య(35) డ్రైవర్ గా జీవనం సాగించేవాడు.
ఇంటి బయట నిద్రిస్తుండగా వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు అతని గొంతు కోసి హత్య చేశారు. తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్పీ అనిల్ బాబు విచారణ చేస్తున్నారు.