చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ పద్మావతిపురాికి చెందిన సురేష్, తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు కాలడిపేటకు చెందిన నటరాజన్... ఉమాపతి అనే వ్యక్తి దగ్గర వెల్డింగ్ పనులు చేస్తుంటారు. శనివారం రాత్రి ఇద్దరు కలసి మద్యం సేవించారు. మద్యం మత్తులో నటరాజన్ సురేష్ తలపై రాడ్డుతో కొట్టాడు. సురేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.షెడ్ ఓనర్ ఉమాపతి ఉదయం వచ్చే చూసేసరికి సురేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు నటరాజన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మద్యం మత్తులో గొడవ... ఒకరు మృతి - చిత్తూరులో జిల్లాలో మద్యం మత్తులో తాజా మరణ వార్తలు
మద్యం మత్తులో ఇద్దరు వెల్డింగ్ వర్కర్ల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ పద్మావతిపురంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Brutal murder of a person under the influence of alcohol happedn in chittoor dst tirupati