చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నర్సింగ్ వీధిలో ఓ మహిళ హత్యకు గురైంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలు కారణంగా హత్య జరిగిందా... లేక గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాసిన్ భర్త అంజద్... మసీదులో గురువుగా పనిచేస్తాడు. సాయంత్రం వేళలో ఆయన మసీదుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
మదనపల్లిలో మహిళ దారుణ హత్య - Madanapalle
మదనపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. నర్సింగ్ వీధిలో నివాసముంటున్న తాసిన్ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇంట్లోనే తాసిన్ గొంతుకోసి హత్య చేశారు.
మదనపల్లిలో మహిళ దారుణ హత్య