చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళం ప్రాంతానికి చెందిన సాయి కుమార్, వెంకటేష్ సోదరులు. మంగళంలో కూరగాయలు, పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. కుటుంబ కలహాలతో వీరిరువురూ... తిరుచానూరు సమీపంలోని దామినేడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
తిరుచానూరులో విషాదం: చెరువులోకి దూకి సోదరులు ఆత్మహత్య - తిరుచానూరు క్రైం న్యూస్
వారిద్దరూ సోదరులు... కూరగాయలు, పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుటుంబంలో జరుగుతున్న ఘర్షణలతో మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తిరుచానూరులో జరిగింది.
చెరువులోకి దూకి సోదరులు ఆత్మహత్య
సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు... స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: