Rains in Tirumala: రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన భక్తులను వెంటాడుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో నడకదారి మార్గం చెల్లాచెదురు కావడమే కాకుండా.. కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. తాజాగా మళ్లీ కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Landslides broken in Tirumala: తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండవ కనుమ దారిలోని లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.. పెద్ద బండరాళ్లు అడ్డంగా పడిపోయాయి. ఘటన సమయంలో వాహన రాకపోకలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై అడ్డంగా రాళ్లు పడటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. రాళ్లను తొలిగించే పనిలో పడ్డారు. బండరాళ్లు పడటంతో రహదారి ధ్వంసమైంది.
రోడ్డు మరమ్మతులు పూర్తయ్యేవరకు తిరుమల కొండపైకి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. కొండనుంచి దిగువకు వచ్చే మార్గంలోనే వాహనాలకు అనుమతినిచ్చారు. దిగువ కనుమ దారిలోనే విడతలవారీగా పైకి, కిందకు వాహనాలను పంపిస్తున్నారు.
దర్శనాలు వాయిదా వేసుకోండి..