భక్త కన్నప్ప ధ్వజారోహణంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో వార్షిక మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని ఆనుకుని ఉన్న కొండపై వెలసిన కన్నప్పకు... వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ధ్వజారోహణం చేపట్టారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో 13 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు భక్త కన్నప్పకు ప్రత్యేక పూజలు చేసి.. ధ్వజారోహణం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం