Kanipakam Brahmostavalu: చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం ముగియనున్నాయి. ఉదయం వసంతోత్సవాలలో భాగంగా స్వామి వారిని ఆలయ పురమాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ సిబ్బంది, గ్రామస్థులు ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ రోజు ముగియనున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలు - Kanipaka Varasiddhi Vinayaka Swamy
Kanipakam Brahmostavalu : కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగియనున్నాయి. సాయత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో ఆలయ ఉత్సవాలు పూర్తవనున్నాయి. రేపటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో తెలిపారు.
![ఈ రోజు ముగియనున్న కాణిపాకం బ్రహ్మోత్సవాలు Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16324402-364-16324402-1662709709711.jpg)
Etv Bharat
శనివారం నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన ఆలయ సిబ్బందికి, గ్రామస్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. పశుపక్ష్యాదులను కాపాడటంలో భాగంగా.. రేపటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారి తెలిపారు.
ఇవీ చదవండి: