చిత్తూరు జిల్లా పలమనేరులో బీసీ బాలుర వసతి గృహం నుంచి వెళ్లిపోయిన తొమ్మిదోతరగతి విద్యార్థుల ఆచూకీని పోలీసులు గుర్తించారు.గురువారం వసతిగృహంలో అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్దులు ఆచూకీ లేకుండా పోయారు.దీంతో ప్రధానోపాధ్యాయురాలు రుక్మిణమ్మ వార్డెన్ సురేష్ కు,పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్ధులను వెతికేందుకు ప్రత్యేక బృందాలుగా దిగిన పోలీసులు విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించారు.ఈ ఘటనతో పోలీసులు విద్యార్థులను,తల్లిదండ్రులను,ప్రధానోపాధ్యాయురాలు,వార్డెన్ ను స్టేషన్ కు పిలిపించారు.అందరి సమక్షంలో పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి వార్డెన్ కు అప్పగించారు
.