చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో రెండురోజుల క్రితం అదృశ్యమైన బాలుడు దొరికాడు. 48 గంటల వ్యవధిలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 24న బాలుడు ఇమ్రాన్ (11) ఆడుకోవడానికి వెళ్లాడు. మంగళవారం వరకు కనపడలేదు. తల్లిదండ్రులు పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం పాకాల మండలం నేండ్రగుంట వద్ద బాలుడు ఇమ్రాన్ని గుర్తించి... కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
బాలుడి కిడ్నాప్... 48 గంటల్లో ఛేదించిన పోలీసులు - పశ్చిమగోదావరి జిల్లా తాజా సమాచారం
బాలుడి కిడ్నాప్ కేసును పాకాల పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలుని కిడ్నాప్‌ను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు