భూత, చిలుక వాహనంపై విహరించిన శ్రీ కాళహస్తీశ్వరుడు - srikalahastheshwara and sri gnanaprasunambika devi uregimpu
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో భూత రాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీ జ్ఞానప్రసూనాంభికాదేవి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివనామస్మరణతో మాడవీధులు మార్మొగాయి.
భూతల కైలాసంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో... మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భూత రాత్రిని పురస్కరించుకొని... భూత వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీ జ్ఞానప్రసూనాంభికాదేవిని చిలక వాహనంపై ఊరేగించారు. స్వర్ణాభరణ అలంకరణలో ఆదిదంపతులు మాడవీధుల్లో ఊరేగారు. భక్తుల కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఆదిదంపతులు ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తి శివనామస్మరణతో మార్మోగింది.