ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు బాంబు పేలి ఆవుకు గాయాలు - చిత్తూరు జిల్లాలో నాటు బాంబు పేలి ఆవుకు గాయాలు

ఓ మనిషి చేసిన తప్పు.. మూగజీవికి ముప్పుగా మారింది. పాలు ఇచ్చి మేలు చేసే గోమాతకు కీడు చేసింది. మేతకు వెళ్లిన సమయంలో పొరపాటున వేటగాడు పెట్టిన నాటుబాంబును కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. గాయపడిన ఆవును గుర్తించిన స్థానికులు పశు వైద్యశాలకు తరలించారు.

bomb exploded
bomb exploded

By

Published : Jun 29, 2020, 9:44 AM IST

మనిషి చేస్తున్న తప్పులకు మూగజీవాలు బలైపోతున్నాయి. నాటు బాంబు పేలి ఓ ఆవు తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కోగిలేరు సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తోంది. పీఠానికి చెందిన ఓ ఆవు శనివారం సాయంత్రం మేతకు వెళ్లిన సమయంలో పొరపాటున వేటగాడు పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం ఛిద్రమైంది. ఇది గమనించిన స్థానికులు ఆవును పశు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆదివారం పశు వైద్యాధికారుల సమక్షంలో ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details