చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుండెపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో గురువారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆదివారం ఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. పీలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పీలేరు మండలం ముంతవారి పల్లికి చెందిన చంద్రారెడ్డిగా గుర్తించారు.
పీలేరులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుండెపల్లి వద్ద వాగులో గురువారం రాత్రి గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడి పాత చిత్రం