రాజ్యాంగబధ్దమైన పదవిలో ఉంటూ న్యాయవ్యవస్థను కించపర్చేలా ప్రకటనలు చేసిన శాసన సభాపతి తమ్మినేని సీతారాంపై కోర్టు ధిక్కారం కింద విచారణ చేపట్టాలని భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు హైకోర్టుకు ఐదు పేజీల ఉత్తరం రాశారు. సభాపతి చేసిన ప్రకటనలు న్యాయవవస్థను అవమానించేలా ఉన్నాయని... కోర్టు తీర్పులపై ప్రజల్లో అనుమానాలు రెకెత్తించేలా సభాపతి ప్రకటనలు చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
'కోర్టు ధిక్కారం కింద సభాపతి తమ్మినేనిపై విచారణ చేపట్టాలి' - కోర్టు ధిక్కారం కింద సభాపతి తమ్మినేనిపై విచారణ చేపట్టాలి
సభాపతి తమ్మినేని సీతారాంపై కోర్టు ధిక్కారం కింద విచారణ చేపట్టాలని భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు డిమాండ్ చేశారు. రాజ్యాంగబధ్దమైన పదవిలో ఉంటూ న్యాయవ్యవస్థను కించపర్చేలా ప్రకటనలు చేశారని విమర్శించారు. ఈమేరకు హైకోర్టుకు ఐదు పేజీల ఉత్తరం రాశారు.

'కోర్టు ధిక్కారం కింద సభాపతి తమ్మినేనిపై విచారణ చేపట్టాలి'
శాసనసభాపతి ప్రకటనలపై సుమోటోగా విచారణ లేదా తన ఉత్తరాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టాలని రమేష్‌నాయుడు కోరారు. సభాపతి కోర్టులపై చేసిన ప్రకటనలు బాధకలిగించడంతోనే హైకోర్టుకు ఉత్తరం రాశానన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు జాతీయ నాయకుల అనుమతితోనే కోర్టుకు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.
TAGGED:
speaker comments on courts