చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో అధికారులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని తేదేపా, భాజపా, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. శ్రీకాళహస్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురయ్యే వారికి ఫారం -7ను అందజేయాల్సి ఉండగా.. శ్రీకాళహస్తి, ఏర్పేడు తొట్టంబేడు, రేణిగుంట మండలాల్లో ఎలాంటి ఫారాలను అందజేయకుండా అధికారులు వెళ్లిపోయారని వాపోయారు. ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు కూడా అందుబాటులోకి రాకపోవటం దారుణంని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు తేల్చి చెప్పటంతో.. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని చర్చలు నిర్వహించారు.
'నామినేషన్ల పరిశీలనలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన' - నామినేషన్ల పరిశీలనలో అవకతవకలపై అభ్యర్ధులు ఆందోళన' వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రోడ్డుపై తెదేపా, భాజపా, జనసేన నేతలు ధర్నాకు దిగారు. నామినేషన్లు తిరస్కరణలో అవకతవకలు జరిగాయంటూ రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నారు.

నామినేషన్ల పరిశీలనలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన
ఇవీ చూడండి... :కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. రీకౌంటింగ్ చేయాలంటూ ఆందోళన