ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎవరి ఒత్తిడితో ఎమ్మెల్యేకు, అతని అనుచరులకు శ్రీవారి దర్శనం కల్పించారు?' - bjp state Spokes person Bhanuprakash Reddy latest comments

తిరుమల శ్రీవారి దర్శనం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వస్తున్న భక్తులను అలిపిరి వద్దే ఆపేస్తున్న తితిదే అధికారులు.. అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే తీసుకొచ్చిన రెండు వేల మందికి దర్శనాలు ఎలా చేయించారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఏడు లక్షల రూపాయలను ఏడు రోజుల్లో తితిదే అధికారులు వసూలు చేసి శ్రీవారికి సమర్పించాలని తిరుపతిలో డిమాండ్ చేశారు.

bjp state Spokes person Bhanuprakash Reddy
భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

By

Published : Dec 24, 2020, 11:58 AM IST

దూర ప్రాంతాల నుంచి వచ్చిన సర్వదర్శం టోకెన్ల కోసం ఆందోళన చేస్తున్న భక్తులకు న్యాయం చేయాలని తిరుపతిలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తితిదేను కోరారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి పాదయాత్రగా వస్తున్న భక్తులను అలిపిరి వద్దే ఆపేస్తున్న తితిదే అధికారులు.. అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే తీసుకొచ్చిన రెండు వేల మందికి దర్శనాలు ఎలా చేయించారని ప్రశ్నించారు.

అన్నమయ్య కాలి బాట ద్వారా శేషాచల అటవీ మార్గంలో రెండు వేల మందితో తిరుమల వచ్చిన వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, ఆయన మనుషులకు ఎవరి ఒత్తిడితో దర్శనం కల్పించారో బయటపెట్టాలన్నారు. డ్రోన్లు ఉపయోగిస్తూ ప్రచారం కోసం తాపత్రాయపడిన వారి కోసం ఒకరికి 300 రూపాయల టికెట్ చొప్పున ఆరు లక్షల రూపాయలు.. మరో లక్ష రూపాయల వడ్డీ కలిపి.. ఏడు లక్షల రూపాయలను 7 రోజుల్లో తితిదే అధికారులు వసూలు చేసి శ్రీవారికి సమర్పించాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details