ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీనివాసుడి సేవలో సోము వీర్రాజు, భాజపా నేతలు - BJP state president Somuveerraju visited tirumala temple

భాజపా రాష్ట్ర అద్యక్షుడు సోమువీర్రాజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ విరామ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు తితిదే అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు.

BJP state president Somuveerraju
శ్రీనివాసుడి సేవలో సోము వీర్రాజు

By

Published : Nov 13, 2020, 12:43 PM IST

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతీ రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఉదయం ప్రారంభ విరామ దర్శనం సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి సంపదలపై ప్రభుత్వం కన్నుపడిందని సోము వీర్రాజు ఆరోపించారు. సహజ వనరులు, ప్రకృతి సంపదలకు నెలవైన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దేలనే జ్ఞానాన్ని పరిపాలకులకు అందించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్​ స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details