తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక పోలింగ్‌ను రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీచేసి పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలని కోరారు. ఉప ఎన్నిక జరిగిన తీరు ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టగా మారిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో అధికార వైకాపా భారీగా దొంగ ఓట్లు వేయించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని ఆక్షేపించారు.
అధికార పార్టీ కనుసన్నల్లో పోలింగ్...
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించుకునేందుకు వైకాపా నాయకులు ఐడీలు తయారుచేస్తున్న విషయాన్ని భాజపా బహిరంగంగా తెలిపినప్పటికీ.. ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం పట్టించుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలతో రాత్రికి రాత్రే భారీగా ప్రజలను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన పోలింగ్.. అధికార పార్టీ కనుసన్నల్లో ఏకపక్షంగా జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు.
ఇవీచదవండి.
ముగిసిన తిరుపతి పోలింగ్.. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు