చిత్తూరు జిల్లా సదుం మండల ఎంపీడీవో కార్యాలయంలో భాజపా నాయకుడు కలికిరిహరిపై దౌర్జన్యం చేసిన వైకాపా నాయకులను అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, కలెక్టర్ భరత్ గుప్తాకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన తమ పార్టీ నాయకుడిపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడటం అప్రజా స్వామికమని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి - latest news bjp politics in chittoor dst
చిత్తూరు జిల్లా సదుము మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ పత్రాలు తీసుకొస్తున్న భాజపా నేతపై వైకాపా నేతలు దాడి చేయడాన్ని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు.
![నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి bjp state precedent bhanu praksah complaint on ycp leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6359980-172-6359980-1583838149907.jpg)
వైకాపా నాయకులపై భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ ఫిర్యాదు
వైకాపా నాయకులపై భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ ఫిర్యాదు
TAGGED:
latest news of bjp