ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజాపా నేతల ధర్నా - thirupathi

అన్యమత ప్రచారానికి కారణమైన ఆర్టీసీ వైఖరిని నిరసిస్తూ, భాజాపా శ్రేణులు తిరుపతి ఆర్టీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాయి. బాధ్యులపై తగు చర్య తీసుకోకపోతే, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించిన నేతలు

bjp sate secrotary protests front of rtc office in thirupathi at chittore district

By

Published : Aug 23, 2019, 6:39 PM IST

ధర్నా చేస్తున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి ,సామంచి శ్రీనివాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాయకులు

తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై నిషేదం ఉన్నా,ఆర్టీసీ టిక్కెట్ల వెనక అన్యమత ప్రకటనలు రావడంపై చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్టీసీ కార్యాలయం ఎదుట భాజాపా నేతలు ఆందోళనకు దిగారు.శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఆర్టీసీ వైఖరిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదని,భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని,అన్యమత ప్రచారానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details