రాష్ట్రంలో అప్పులు పెరిగాయి కానీ.. అభివృద్ధి జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో భాజపా పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు రూ. 22 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. వైకాపా ప్రభుత్వం కేవలం రూ.4వేల కోట్లే ఖర్చు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తుందని విమర్శించారు.
'రాష్ట్రంలో అప్పులు పెరిగాయి కానీ.. అభివృద్ధి జరగలేదు' - రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా వార్తలు
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైకాపా ప్రభుత్వం పేరు మార్చుకొని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాజంపేట పార్లమెంటరీ స్థాయి భాజపా సమావేశం అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.
!['రాష్ట్రంలో అప్పులు పెరిగాయి కానీ.. అభివృద్ధి జరగలేదు' bjp rally in Chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9965211-861-9965211-1608625605152.jpg)
bjp rally in Chittoor district
సమావేశం అనంతరం మదనపల్లిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నక్కలదిన్నె నుంచి పట్టణ ప్రధాన వీధి గుండా.. ర్వాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్రనాయకులు ఏవి సుబ్బారెడ్డి, చర్లపల్లి నర్సింహారెడ్డి, బండి ఆనంద్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అధికారుల తీరుపై మనస్థాపం.. కౌలు రైతు ఆత్మహత్యాయత్నం