ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో హిందూ ధర్మం నిలవాలంటే తిరుపతిలో భాజపా గెలవాలి' - తిరుపతి భారతీయ జనతా పార్టీ

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వైకాపా సర్కార్ హింధూ ధర్మ పరిరక్షణ కోసం కాకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో భాజపా గెలిస్తేనే సనాతన హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించగలమని ఆయన పేర్కొన్నారు.

'రాష్ట్రంలో హిందూ ధర్మం నిలవాలంటే తిరుపతిలో భాజపా గెలవాలి'
'రాష్ట్రంలో హిందూ ధర్మం నిలవాలంటే తిరుపతిలో భాజపా గెలవాలి'

By

Published : Mar 30, 2021, 9:38 AM IST

తిరుమల శ్రీవారిని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి దర్శించుకున్నారు. కోట్లాది రూపాయల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ప్రభుత్వం అన్యమతాలకు తరలించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తితిదే సొమ్మును హిందూయేతర కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని విష్ణు తప్పుబట్టారు. రాష్ట్రంలో హిందూ ధర్మం నిలవాలంటే తిరుపతిలో భాజపా గెలవాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details