చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం సి.రామాపురం దగ్గర ఉన్న బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని భాజాపా ఎంపీ మేనకా గాంధీ సందర్శించారు. స్థానిక భాజపా నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆశ్రమంలో పది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా తొలిరోజు వేడుకలకు మేనకా గాంధీ హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ శ్రీ గురూజీ ఆశీర్వాదం తీసుకొని మండపంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును సందర్శించారు. భక్తులకు ఆశ్రమ నిర్వాహకులు అన్నదానం చేశారు.
బ్రహ్మశ్రీ ఆశ్రమ నవరాత్రి ఉత్సవాల్లో భాజపా ఎంపీ మేనకా గాంధీ - భాజపా ఎంపీ మేనకా గాంధీ
కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ మేనకా గాంధీ.. చిత్తూరు జిల్లాలోని బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని సందర్శించారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
బ్రహ్మశ్రీ ఆశ్రమంలో భాజపా ఎంపీ మేనకా గాంధీ: దేవి దర్శనం కోసమే!