చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నందీశ్వర విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భాజపా నేతలు పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. కొందరు ఆలయ అధికారుల ప్రమేయంతోనే ఆలయం లోపల విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి వారిని కఠినంగాశిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆలయ ఈఓకి వినతిపత్రం అందచేశారు.
'అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వారిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు ఈఓకు వినతిపత్రం అందజేశారు.
ఆలయ ఈవో కు వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు
ఇదీ చదవండి