'రాజధాని రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టవా?' - ఏపీ అమరావతి వార్తలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు,మహిళలు ఆందోళనలు చేస్తున్న... ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో జాతీయ సమైక్యాతా శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి విష్ణువర్థన్‌రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల బాధ వినకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి ప్రవర్తిస్తోందన్నారు. తక్షణం మహిళారైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి