జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్' బెనిఫిట్ షోను ప్రభుత్వం రద్దు చేయటాన్ని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జి సునీల్ దేవధర్ ఖండించారు. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డితో కలిసి నిరసన చేపట్టారు.
'వకీల్ సాబ్' బెనిఫిట్ షోను ఎందుకు రద్దు చేశారు: సునీల్ దేవ్‌ధర్ - vakilsab benifit show cancel in thirupathi
తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద భాజపా నేతలు సునీల్ దేవ్‌ధర్, భానుప్రకాష్ రెడ్డి నిరసన చేపట్టారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఖండించారు.
భాజపా నేతలు సునీల్ దేవ్‌ధర్, భానుప్రకాష్ రెడ్డి నిరసన
సీఎం జగన్ పవన్ కల్యాణ్‌కే కాకుండా ఆయన సినిమాలకూ భయపడుతున్నారని సునీల్ దేవ్‌ధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం కోర్టులకు వెళ్లాల్సిన వారే... వకీల్ సాబ్‌ను చూసి భయపడతారంటూ సునీల్ దేవధర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీచదవండి.
విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న బదిలీలు
Last Updated : Apr 9, 2021, 5:11 PM IST