తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో భాజపా విజయ సాధనకు కార్యకర్తలు శ్రమించాలని పార్టీ నేత సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రెండో రోజు జరిగిన భాజపా అసెంబ్లీ సంస్థాగత శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. వైకాపా అవినీతి పాలనను ప్రజలకు తెలియజేస్తూ..ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతితో సంపాధించిన నగదును పెట్టుబడులుగా పెట్టి అధికంగా ఆదాయాలు పొందుతున్నారని ఆరోపించారు.
'తిరుపతి ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి' - తిరుపతి ఉపఎన్నికలపై సునీల్ దేవధర్ కామెంట్స్
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రెండో రోజు జరిగిన భాజపా అసెంబ్లీ సంస్థాగత శిక్షణా తరగతులకు ఆపార్టీ నేత సునీల్ దేవధర్ హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాజపా విజయ సాధనకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.
'తిరుపతి ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి'