ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల్లో వ్యతిరేకతతోనే ప్రభుత్వం వెనక్కు తగ్గింది' - తిరుమల భూముల వేలంపై రామ్​ మాధవ్ స్పందన

తితిదే ఆస్తుల వేలం ప్రతిపాదనపై భాజపా నేత రామ్​మాధవ్ స్పందించారు. వివాదాస్పదమైన ఈ నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని పేర్కొన్నారు.

bjp-leader-ram-madhav
bjp-leader-ram-madhav

By

Published : Jun 4, 2020, 5:31 PM IST

ఆస్తులు వేలం వేయాలని ఇటీవల తితిదే చేసిన ప్రతిపాదన.. వివాదాస్పదమైనదని భాజపా నేత రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో.. ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుందన్నారు.

దేవస్థాన భూములను వేలానికి పెడతామన్న ప్రకటనతో.. భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన కారణంగానే ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details