చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి అందించే కేంద్ర ప్రభుత్వ నిధులను కాజేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పథకం రచించారని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన శ్రీకాళహస్తి ఎంపీడీవో బాలాజీ నాయక్‌ను పురపాలక సంఘం కమిషనర్‌గా నియమించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు.
రానున్న పురపాలక ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం బాలాజీ నాయక్ నియామకం జరుగుతోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలోకి వచ్చాక ఏకపక్ష నిర్ణయంతో 11 పంచాయతీలను పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కోలా ఆనంద్ హెచ్చరించారు.