ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామపత్రాలు లాక్కెళ్లిన వారిని శిక్షించాలి: విష్ణువర్ధన్ రెడ్డి - నామపత్రాలు లాక్కెళ్లిన వారిని శిక్షించాలి: విష్ణువర్ధన్ రెడ్డి

చిత్తూరు జిల్లాలో భాజపా బలపరిచిన అభ్యర్థి నామపత్రాలను వైకాపా నేతలు లాక్కెళ్లారని.. ఇది సరికాదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని చౌడేపల్లి పీఎస్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అభ్యర్థి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.

vishnu varthan reddy fired on chittoor incident
నామపత్రాలు లాక్కెళ్లిన వారిని శిక్షించాలి: విష్ణువర్ధన్ రెడ్డి

By

Published : Feb 7, 2021, 8:04 PM IST

చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమాకుల పల్లెలో భాజపా బలపరిచిన అభ్యర్థి రజినీ నామినేషన్ వేసేందుకు సిద్దమవగా.. ఆమె భర్త చిన్ని కిషోర్ పై దాడి చేసిన వైకాపా నాయకులు కిషోర్, ప్రదీప్ రాజు నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారని చెప్పారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తూ పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

'పోలీసులు రక్షణ కల్పించాలి'

వైకాపా నేతలు అధికారులను సైతం బెదిరిస్తున్నారని భాజపా నేతలు విమర్శించారు. విపక్షాల మద్దతుదారులపై నిత్యం దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్ అభ్యర్థిని రజిని, వారి కుటుంబానికి పోలీసులు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఉపన్యాసాలు చెప్పే ఎస్ఈసీ నిమ్మగడ్డ, రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సత్సంగ్‌ ఆశ్రమాన్ని సందర్శించిన రాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details