ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే కేసు ఉపసంహరణపై మండిపడ్డ భాజపా నేత భానుప్రకాశ్​రెడ్డి - BJP leader Bhanuprakash Reddy latest updates

వైకాపా నేతవిజయసాయిరెడ్డి, తితిదే పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై తితిదే వేసిన పరువు నష్టం కేసు ఉపసంహరించుకోవడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న భాజపా నేత
మాట్లాడుతున్న భాజపా నేత

By

Published : Oct 22, 2020, 2:58 PM IST

తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించేలా ప్రకటనలు చేశారంటూ వైకాపా నేత విజయసాయిరెడ్డి, పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై తితిదే వేసిన పరువు నష్టం కేసు ఉపసంహరించుకోవడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పరువునష్టం కేసు విచారణ కోసం కోర్టు ఫీజుల రూపంలో రెండు కోట్ల రూపాయలు తితిదే ఖర్చు చేశాక ...కేసు ఉపసంహరించుకోవడంలో అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

వైకాపా, తెదెేపా రాజకీయంగా బలబలాలు తేల్చుకోవడానికి తిరుమల శ్రీవారిని వాడుకోవద్దని భానుప్రకాశ్‌రడ్డి హితవు పలికారు. ఎవరి మెప్పు కోసం కేసు వేశారు....ఎవరిని సంతృప్తిపరచడం కోసం కేసు ఉపసంహరించుకొన్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాలకమండలి పదవి... హోదా కాదని....స్వామి వారి నిధులకు కాపలదారు మాత్రమేనని అన్నారు. పరువు నష్టం కేసు కోసం ఖర్చు చేసిన రెండు కోట్ల రూపాయలను వడ్డీతో సహా స్వామివారి ఖజానాకు జమచేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

శ్రీవారి సేవలో పలువురు మంత్రులు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details