ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులను, భాజపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ భాజపా- జనసేన నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కోదండ రామాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
చంద్రగిరిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద దేవాలయాలపై దాడులను ఆపాలంటూ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. తరువాత ఎమ్మార్వో కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని భాజపా- జనసేన నాయకులు పాల్గొన్నారు.