తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారంపై భాజపా తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని..., హిందువుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికిభాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణసూచించారు.
అన్యమత ప్రచారానికి కారకులైన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని... కుట్రలో భాగంగా జరుగుతోందని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. బాధ్యులైన వారిని భక్తుల ముందు నిలబెట్టాలని కోరారు.