హిందువుల దేవాలయాలపై దాడులను నిరసిస్తూ చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద భాజపా, జనసేన నేతలు ర్యాలీ చేశారు. దేవాలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. హిందూ మతాన్ని గౌరవించి.. ఆలయాలను పరిరక్షించకపోతే ప్రభుత్వానికి పుట్టగతులుండవని భాజపా నేతలు అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రితో సహా మంత్రులు సైతం స్పందించకపోవడం దారుణమని జనసేన నేతలు విమర్శించారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేయడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని నేతలు వ్యాఖ్యానించారు.