చిత్తూరు జిల్లా చంద్రగిరిలో భాజపా 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్రహ్మణ్యం యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం టవర్ క్లాక్ వద్ద జెండా ఆవిష్కరించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే నరేంద్ర మోదీ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఘనంగా భాజపా ఆవిర్భావ వేడుకలు - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లాలో 41వ భాజపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో భాజపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఘనంగా భాజపా ఆవిర్భావ వేడుకలు
కేంద్ర సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వం తాము ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు దొరస్వామి, కార్యదర్శి నరేష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు