తిరుపతి...
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలో వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం నుంచి నగరపాలక సంస్థ కార్యలయం వరకు చేపట్టిన ర్యాలీలో ....కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు కార్మికుల జీవితాలను అతలాకుతలం చేసేలా ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు.
మదనపల్లి....
మదనపల్లి సీఐటీయూ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన... ప్రధానం వీధుల గుండా చేసిన ఈ ర్యాలీలో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మదనపల్లె ఉప పాలనాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేసి... వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు.
సీఏఏ కు మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థులను బలవతంగా తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతినిచ్చిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రగిరి...
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో తమ న్యాయబద్ధమైన డిమాండ్లను సత్వరమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 21వేలుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పుత్తూరు...
భారత్ బంద్ కార్యక్రమంలో పుత్తూరులో భాగంగా వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మికులకు రూపాయలు 18 వేలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ - central government issues in india
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలు బంద్ నిర్వహించాయి.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్
ఇవీ చూడండి-'ప్రభుత్వం మారితే రాజధాని మార్చాలా..!'