ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్ - చిత్తూరు జిల్లాలో భారత్ బంద్ తాజా వార్తలు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు బంద్​లో పాల్గొని.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

chittor, bharat bandh
చిత్తూరులో భారత్ బంద్

By

Published : Mar 26, 2021, 4:48 PM IST

చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని మదనపల్లిలో వామపక్ష పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూసివేశారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

శ్రీకాళహస్తిలో

శ్రీకాళహస్తిలో భారత్ బంద్ కొనసాగుతోంది. తేదేపా, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్​కు సంఘీభావం తెలిపారు.

ఇదీ చదవండి:

ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యం..మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ విచారణ

ABOUT THE AUTHOR

...view details