ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాకరాపేట కనుమ దారి ప్రమాదాలకు నిలయం - road accidents at bakarapeta

చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారి ప్రమాదాలకు నిలయమైంది. పుణే నుంచి రేణిగుంటకు కెమికల్ లోడుతో వెళుతున్న లారీ ధన కోటగంగమ్మ గుడి మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

bhakarapeta pass is home to road accidents at chittoor district
భాకరాపేట కనుమ దారి ప్రమాదాలకు నిలయం

By

Published : Oct 26, 2020, 9:41 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారి ప్రమాదాల దారిగా మారింది. వారం రోజుల వ్యవధిలో ఆరు లారీలు బోల్తా పడ్డాయి. ఈ కనుమ దారి ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తోంది. ఈ కనుమదారిలో ప్రమాద సూచికలు లేకపోవడం...ప్రమాదకర మలుపుల వద్ద ప్రహరీ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

పుణే నుంచి రేణిగుంటకు కెమికల్ లోడుతో వెళుతున్న లారీ ధన కోటగంగమ్మ గుడి మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్​కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

ABOUT THE AUTHOR

...view details