ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BHAIRAVAKONA WATER FALLS: కొండల మధ్య నుంచి జాలువారి.. శివలింగాన్ని అభిషేకిస్తూ..

కొండలు, చెట్ల మీదనుంచి జాలువారుతున్న గంగమ్మ.. కిందకు దూకి శివలింగంపై పడి స్వామివారిని అభిషేకిస్తోంది. ఈ అద్భుత ఘట్టం భైరవకోనలో ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు.

bhairavakona-water-falls-in-srikalahasthi
కొండల మధ్య నుంచి జాలువారి.. శివలింగానికి అభిషేకం..!

By

Published : Nov 12, 2021, 2:57 PM IST

భారీ వర్షాలతో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుసంధానంగా ఉన్న భైరవకోనలో జలపాతం ఆహ్లాదకరంగా దర్శనమిస్తోంది. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీరు.. భైరవకోనలోని శివలింగంపై పడుతూ స్వామి వారికి అభిషేకిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులు భైరవకోనకు వెళ్లి.. జలపాతాన్ని వీక్షించి ఆనందభరితులవుతున్నారు.

కొండల మధ్య నుంచి జాలువారి.. శివలింగానికి అభిషేకం..!

ABOUT THE AUTHOR

...view details