ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాల సేకరణ ప్రారంభం - పీలేరులో రెండు కోట్ల సంతకాల సేకరణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా రెండు కోట్ల సంతకాల సేకరణ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు ప్రారంభించారు.

Begin collection of two crore signatures against the Agriculture Bill at peeleru
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాల సేకరణ ప్రారంభం

By

Published : Oct 15, 2020, 7:19 PM IST


చిత్తూరు జిల్లా పీలేరులో మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా రెండు కోట్ల సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు పాల్గొన్నారు. మూడు బిల్లులను వ్యవసాయరంగ నిపుణులతో చర్చించకుండా హడావిడిగా తీసుకరావడం అప్రజాస్వామికమన్నారు. ఈ బిల్లులు వ్యవసాయ సంక్షోభానికి, రైతు వినాశనానికి దారితీస్తాయని... అన్నారు. ఈ వీటి ద్వారా పండించే పంటలకు కనీస మద్దతు ధర దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు అంతరించిపోతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details