తిరుమల కొండల్లో ప్రకృతి రమణీయత.. వీక్షకుల మనసులను దోచుకుంటోంది. తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. సప్తగిరుల్లోని అందాలను ఆస్వాదిస్తున్నారు. కొండలను ముద్దాడుతున్న మేఘాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. నోటి వెంట గోవింద నామస్మరణ.. కళ్ల ముందు భూతలస్వర్గం లాంటి వాతావరణంలో ప్రశాంతత పొందుతున్నారు.
మది దోస్తున్న తిరుగిరుల అందాలు - శ్రీవారు
తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి తిరుమల వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొండలను తాకుతున్న మేఘాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
మనసు దోచుకుంటున్న తిరుమల అందాలు