చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బసినికొండ పంచాయతీ అయ్యప్పనగర్ వార్డు ప్రజలు.. ఎన్నికలను బహిష్కరించారు. ఏళ్ల తరబడి తాము సమస్యలతో ఇబ్బందిపడుతున్నా... పట్టించుకునే నాథుడే కరవయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పారిశుద్ధ్య పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మండిపడ్డారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పారిశుద్ధ్య పనుల్లో తీవ్ర జాప్యం.. ఎన్నికలు బహిష్కరించిన ప్రజలు - చిత్తూరు జిల్లా బసినికొండ గ్రామస్థులు తాజా వార్తలు
ఏళ్ల తరబడి తాము సమస్యలతో ఇబ్బందిపడుతున్నా... పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆగ్రహించిన బసినికొండ పంచాయతీ అయ్యప్పనగర్ వార్డు ప్రజలు.. ఎన్నికలను బహిష్కరించారు.
ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు